/rtv/media/media_files/2025/02/26/62whZMo4AVfayae3AGzo.jpg)
Mahashivratri 2025 Father and son died bathing in Krishna river
మహాశివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో పుణ్య స్నానాలు ఆచరించి దేవున్ని దర్శించుకుంటున్నారు. అయితే తాజాగా కొందరు భక్తులు నదుల్లో స్నానాలు చేస్తుండగా విషాద ఘటనలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో 11మంది దిగారు. అయితే నీటి ఉద్ధృతికి ఆరుగురు వ్యక్తులు బయటపడగా.. మరో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
వారు పవన్, దుర్గా ప్రసాద్, ఆకాష్, సాయి, పవన్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అలాగే మరోవైపు ఇంకో విషాదం చోటుచేసుకుంది. శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నదిలో తండ్రి, కొడుకు స్నానం చేశారు. అయితే ఇక్కడ కూడా నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో కొడుకు ఆ నీటిలో కొట్టుకుపోయాడు.
Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!
దీంతో అతడిని కాపాడేందుకు తండ్రి వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు కొడుకుతో పాటు తండ్రి కూడా కొట్టుకుపోయాడు. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకు మృతి చెందారు. వారి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. అందువల్ల లోతు అంచనా వేయకుండా నదీ స్నానాలకు దిగొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?
ఘోర రోడ్డు ప్రమాదం
ఇదిలా ఉంటే మరోవైపు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి.
Also Read: మజాకా రివ్యూ.. సందీప్ కిషన్ ఖాతాలో హిట్ పడిందా?