/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
crime news vishaka
AP Crime: ఏపీలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.
ఇద్దరిని బలి తీసుకున్న ప్రేమోన్మాది:
ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు
( AP Crime | ap-crime-news | latest-news | telugu-news)