/rtv/media/media_files/2025/03/18/BY23dvQACzXW0ZF3llO5.jpg)
Lulu Mall
విశాఖతో పాటు అమరావతి, తిరుపతిల్లోనూ మాల్స్ ఏర్పాటుకు లులు సంస్థ సానుకూలంగా ఉంది. దీనికి రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. అమరావతి, తిరుపతిల్లో లులూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరామని చెప్పారు. నిజానికి 2014-19 మధ్యలోనే లులూ మాల్స్ రావాల్సి ఉంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం సాగరతీరంలో ఈ మాల్ కోసం స్థలాన్ని కూడా కేటాయించింది. అయితే 2019లో వైసీపీ వచ్చాక ఆ స్థలాన్ని వెనక్కు తీసేసుకుంది. అంతేకాక లులూ సంస్థను కూడా వెళ్లగొట్టింది. దాంతో అప్పట్లో ఏపీలో ఇంకెప్పుడూ పెట్టుబడులు పెట్టబోమని అప్పట్లో లులూ సంస్థ ప్రతిజ్ఞలాంటిది కూడా చేసింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ ఏపీలో మాల్స్ పెట్టేందుకు అంగీకరించింది. విశాఖలో మాల్ ప్రతిపాదనకు ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమ్మతి తెలియజేసింది. దానికి కేబినెట్ ఇప్పుడు ఆమోదముద్ర వేసింది.
ప్రధాని మోదీ చేతుల మీదుగా..
మరోవైపు ఆంధ్రా రాజధాని అమరావతి పనులు కూడా వేగవంతం అయ్యాయి. అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీని కోసం ఆయన ఈరోజు ఢిల్లీకి వెళుతున్నారు. స్వయంగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా సీఎం కలవనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల జాబితాను ఆర్థిక మంత్రికి వివరించనున్నారు. దాంతో పాటూ ఆ నిధుల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా చంద్రబాబు కోరనున్నారు.
Also Read: Israel: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి