BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తండ్రి, కుమారుడు మృతి!

ఏపీలోని కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు.

New Update
Road accident kadapa

Kurnool road accident Father and son died

ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం. పోలీసులు సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా అలాంటి యాక్సిడెంట్ మరొకటి జరిగింది. భర్త, భార్య, కుమారుడు బైక్ పై వెళ్తుండగా.. అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలోని కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి

బుధవారం ఉదయం అమెరికాలోని చికాగోలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖైరతాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్‌ మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందింది. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అనిల్ కుమార్, పలువురు కాంగ్రెస్‌ నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహమ్మద్ వాజిద్ మృతదేహం అమెరికా నుంచి భారత్‌కు రప్పించేందుకు పనులు జరుగుతున్నాయి.

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

కాగా మహమ్మద్ వాజిద్‌ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం యూఎస్‌ వెళ్లాడు. పేద కుటుంబానికి చెందిన వాజిత్‌ పార్ట్ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూనే తన చదువు కొనసాగించాడు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్‌ డివిజన్ యువజన నాయకుడిగా కూడా పనిచేశారు. ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ మైనార్టీ విభాగంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు. 

New Update
AP

Paster Praveen Case Briefing

మిస్టరీగా మారిన హైదరాబాద్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ఎలా మృతి చెందారో పోలీసులు ఛేదించారు. అత్యాధునిక ఆధారాలు సేకరించడమే కాకుండా.. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్ మార్టం నివేదికలను సమగ్రంగా విశ్లేషించారు. దాని ప్రకారం మార్చి 24న రాజమండ్రికి దగ్గరలో కొంతమూరు దగ్గర పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో మృతి చెందారని నిర్ధించారు. ఈ విషయాన్ని ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ వివరించారు.  

బైక్ మీద వెళ్ళడంతో యాక్సిడెంట్..

కేసు వివరాలను తూర్పుగోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ లో ఎస్పీ నరసింహ కిశోర్ తో కలిసి ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికలో ప్రవీణ్ మద్యం తాగినట్లు ఉందని...తల, శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని..యాక్సిడెంట్ లో ఇవి తగిలి ఉండొచ్చని చెప్పారు. ఘటనాస్థలంలోనే పాస్టర్ ప్రవీణ్ చనిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి ఆయన 70 కి.మీ వేగంతో నాలుగో గేరులో వెళుతున్నట్టు ఆర్టీఏ అధికారులు చెప్పారని వివరించారు. ప్రవీణ్ మృతిలో అనుమానాలు రేకెత్తడంతో కుటుంబసభ్యులతో పాటూ 92 మంది సాక్షులను విచారించామని చెప్పారు. వారెవరికీ ఒకరితో ఒకరికి పరిచయాలు లేవని...ఆయన రాజమండ్రి వస్తున్నట్టు ప్రవీణ్ భార్య, ఇదే ఊరుకు చెందిన ఆకాశ్, అడపాక జాన్ కు మాత్రమే తెలుసునని తెలిపారు. కుటుంబ సభ్యులు సైతం మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని ఐజీ అశోక్ మకుమార్ చెప్పారు.    

అంతేకాదు పాస్టర్ ప్రవీణ్ కావాలనే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద బయలుదేరారని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఆయన కొద్ది రోజులు ఉండాల్సి వస్తుందని, పైగా ఆ వూర్లో అతనికి పనులు ఉండడం వలన బైక్ చేతిలో ఉంటే ఉపయోగపడుతుందని..హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చారని చెప్పారు. హైదరాబాద్ లో మిత్రుడు ఒకరు బైక్ మీద వెళ్ళొద్దని కూడా చెప్పారని అయినా ప్రవీణ్ వినలేదని అన్నారు. 

today-latest-news-in-telugu | paster praveen | accident | bike 

Also Read: AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

Advertisment
Advertisment
Advertisment