భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిపారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఊరు, వాడ, పల్లె, పట్నం.. అనే తేడా లేకుండా మువ్వన్నెల జెండా పండుగను అందరూ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా అన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొన్ని చోట్ల విద్యార్థులు, యువజనులు ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటే.. మరికొన్ని చోట్ల వీఐపీలు సైతం తమదైన శైలిలో కాలు కదిపారు.
Also Read: Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్ దంపతుల డ్యూయెట్లు..
— RTV (@RTVnewsnetwork) January 27, 2025
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పలు సినిమాల్లోని డ్యూయెట్ సాంగ్స్ కు స్టెప్పులు వేసిన కలెక్టర్ దంపతులు..#collector #Machilipatnam #viralvideo #RTV pic.twitter.com/MoxYSeJRYB
ఇక, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ దంపతులు కూడా డ్యాన్స్‌లతో అదరగొట్టారు.. భార్యతో కలిసి సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు కలెక్టర్ బాలాజీ. బుజ్జమ్మా బుజ్జమ్మా.. అంటూ సాగే పాటకు అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేశారు.
కలెక్టర్ బాలాజీ దంపతుల డ్యాన్స్ వీడియోను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది.. మరోవైపు.. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీకి 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఈ మధ్యే ఉత్తర్వులు వచ్చాయి. గతేడాది కృష్ణా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డీకే బాలాజీని ఎంపిక చేసింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ఆ అవార్డును ఆయన అందుకున్నారు.
Also Read: Hyderabad: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు... ఆ సినిమా ప్రేరణతోనే హత్య!
Also Read: California Wild Fire: కాలిఫోర్నియా వాసులకు ఓ గుడ్ న్యూస్.. మరో షాకింగ్ న్యూస్..!