/rtv/media/media_files/2025/04/13/uyWbTtJRXUxe7PlOcf25.jpg)
Mudragada Padmanabham YS Jagan
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read : ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!
Also Read : సజ్జలే నంబర్-2.. ఆయన చెప్పిందే ఫైనల్.. జగన్ సంచలన నిర్ణయం!
ఎన్నికల ముందు వైసీపీలోకి..
కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీలో చేరారు. జనసేన అధినేత పవన్ ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. అయితే.. భారీ మెజార్టీతో పవన్ అక్కడ విజయం సాధించారు. దీంతో మాట ఇచ్చినట్లుగానే ఆయన తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అయితే... ఎన్నికల నాటి నుంచి పద్మనాభ రెడ్డిగా పెద్దగా యాక్టీవ్ గా ఉండడం లేదు. అయితే.. తాజాగా ఆయనను జగన్ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఇందుకు పద్మనాభం కూడా స్పందించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. దీంతో ముద్రగడ మళ్లీ యాక్టీవ్ అవుతారన్న చర్చ ప్రారంభమైంది.
Also Read : తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Also Read : రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !
mudragada padmanabham | ys-jagan | andhra-pradesh-news | andhra-pradesh-politics | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu