/rtv/media/media_files/2025/03/30/z8DV1KCfBaIOV86IvEx1.jpg)
cabinet expansion
Ap News: చాలా కాలంగా నానుతూ వస్తున్న ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు...కోట్లల్లో దందా..
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి వర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు నాగబాబును ఎమ్మెల్సీని కూడా చేశారు. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కొందరు ఆశావహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఐతే ఇప్పుడే మంత్రి వర్గ విస్తరణ వద్దని తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
ఏడాది లోపే మంత్రి వర్గ విస్తరణ చేసి కొందరు మంత్రులను తొలగిస్తే అసమ్మతి నెలకొంటుందని అభిప్రాయంతో భావించినట్టు సమాచారం. మంత్రి పదవులు ఇచ్చి ఏడాది కాకముందే కొందరిని తొలగిస్తే కూటమి పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్‌కు రాంగ్ సిగ్నల్స్ వెళతాయని కూడా బాబు, పవన్‌లు భావిస్తున్నట్టు సమాచారం.
ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు
కొంత కాలం గడిచిన తర్వాత నాగబాబు మంత్రి పదవి గురించి ఆలోచిద్దామని, అప్పటి వరకు పార్టీ బాధ్యతలలో కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలిస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకలపాలు చూస్తున్న నాగబాబు మరికొంతకాలం అవే బాధ్యతల్లో కొనసాగించాలని పవన్ నిర్ణయించుకున్నారట. దీంతో కొంతకాలం దాకా మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చని ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!