/rtv/media/media_files/2025/03/27/hMUA8S7GqH0hqDqHQiTj.jpg)
N Chandrababu Naidu on Polavaram today
AP News :ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికార కూటమిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. అయితే చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వైసీపీ మాజీ నేత ఒకరు చంద్రబాబు కాళ్లపై పడ్డారు. ఈ ఘటన ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలవరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జయమంగళ వెంకటరమణ కలిశారు. చంద్రబాబు నాయుడు కాళ్ళపై పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఈ విత్తనాలు తీసుకుంటే బరువు తగ్గుతారు.. జుట్టుకు కూడా ప్రయోజనం
ఈ నేపథ్యంలో జయమంగళ వెంకటరమణ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. జయమంగళ వెంకట రమణ గతేడాది వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే శాసనమండలి ఛైర్మన్ వద్ద జయమంగళ వెంకటరమణ రాజీనామా పెండింగ్‌లో ఉంది. జయమంగళ వెంకటరమణ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
ఇది కూడా చదవండి: రీహబిలిటేషన్ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్.. నలుగురు చిన్నారులు మృతి
2019 నుంచి జయమంగళ వెంకట రమణ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 17న జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. 2023 మార్చిలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎంఎల్‌ఎ కోటా నుంచి వైసీపీ తరుఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైంది.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!