ఆంధ్రప్రదేశ్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...ఇక పోల’వరం’ కానుంది..! పోలవరం విషయంలో ఏపీ పంటపండింది.రాష్ట్ర ప్రభుత్వం మొర కేంద్ర ప్రభుత్వం చెవికి చేరింది. పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.ప్రాజెక్ట్ లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు శుభవార్త చెప్పింది.రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా తామే భరిస్తామని జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు జవాబిచ్చారు. By V. Sai Krishna 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn