Palnadu : మరో మహిళతో భర్త ఎఫైర్...రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..

భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య ఆమె బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం పెళ్లైన వాసు భార్యను డెలివరీకి పంపి ప్రియురాలితో ఏకంగా కాపురం పెట్టాడు.

New Update
Husband's Affair

Husband's Affair

Husband's affair : భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య ఆమె బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వాసుకు రెండున్నరేళ్ల క్రితం పల్నాడు జిల్లా నకిరేకల్‌ మండలం పళ్లకొండకు చెందిన నవ్యశ్రీతో వివాహమైంది. వాసు సత్తెనపల్లిలో ప్లాస్టిక్‌ హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తుంటాడు. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకొచ్చి సత్తెనపల్లిలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య నెలతప్పడంతో పుట్టింటికి పంపించాడు. అప్పటినుంచి సత్తెనపల్లిలో ఒంటరిగా ఉంటున్నాడు. 

Also Read: America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

కాగా వ్యాపార నిమిత్తం తరచూ హైదరాబాద్‌ వెళ్తున్న సందర్భంలో బంధువుల అమ్మాయి గాయత్రితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భార్య డెలివరీ అయి ఇంటికొచ్చిన తర్వాత కూడా కొంతకాలం మాత్రమే ఉంచుకొని ఏదో ఒక కారణం చెప్పి ఆమెను తిరిగి పుట్టింటికి పంపాడు. అయితే తరుచుగా భార్య వస్తానని చెప్తున్న నేను ఊర్లోలేను, అందుబాటులో లేను అంటూ ఏడాది కాలంగా దాటవేస్తు వస్తున్నాడు. అందులో భాగంగా గాయత్రిని హైదరాబాద్‌ నుంచి తీసుకొని వచ్చి సత్తెనపల్లి లో కాపురం పెట్టాడు.ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండడం కోసం సత్తెనపల్లిలో మూడు ఇళ్లు మారాడు. 

Also Read: Telangana: తెలంగాణ అఘోరీ అరెస్ట్.. కారుతో సహా గాల్లోకెత్తేసి.. అచ్చు అల్లు అర్జున్ జులాయి సినిమా సీన్‌ లాగానే!

అయితే ఈ విషయంలో భార్య నవ్యశ్రీ బంధువులకు అనుమానం రావడంతో వాసుమీదా నిఘా పెట్టారు. ఈక్రమంలో సత్తెనపల్లి బోయకాలనీలో వాసు గాయత్రితో ఉంటున్న విషయం తెలుసుకొని బంధువులతో కలసి వచ్చి వారిని రెడ్‌ హ్యాండేడ్‌గా పట్టుకున్నారు. భార్య రాకను గమనించిన భర్త వాసు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తతోపాటు ప్రియురాలికి భార్య, బంధువులు దేహశుద్ది చేశారు. ఇద్దరిని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయత్రి తన తల్లిదండ్రులకు చెప్పకుండా వాసుతో వెళ్లిపోయింది. ఈ విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు  తమ కుమార్తె కనిపించడం లేదంటూ హైదరాబాద్‌లో తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేయడం కొసమెరుపు.

Also Raed: Kiran Abbavaram K- Ramp: 'కే రాంప్' అంటున్న కిరణ్ అబ్బవరం.. ఇదేం టైటిల్ సామీ..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: జగన్ మానసిక స్థితిపై అనుమానంగా ఉంది.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

జగన్‌పై హోంమంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల బట్టలూడదిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. కాకీ చొక్కా CMR షాప్ నుంచి కొని తెచ్చుకుంది కాదు. ఊడదీస్తానని అనొచ్చా? అంటూ ఫైర్ అయ్యారు.

New Update
AP Home Minister Anitha: జగన్ పై చర్యలు.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

AP Home Minister Anitha fire on ys Jagan

AP News: ఏపీ మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్ చేశారు. పోలీసుల బట్టలూడదిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో IPC సెక్షన్ ప్రకారం కాకుండా YCP సెక్షన్ ప్రకారం పోలీసులు పనిచేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో చట్ట ప్రకారమే నడుచుకుంటారని చెప్పారు. జగను మాటలు వింటే.. ఇదంతా క్రిమినల్ లీడర్ ఫ్రీ ప్లాన్ అని, ఇలా కూడా ఆలోచన చేస్తారా అనిపించిందన్నారు. జగన్ మాట్లాడుతుంటే వారి 5 ఏళ్ల అరాచక పాలన గుర్తుకొచ్చిందన్నారు.

2800 పై చిలుకు హత్యలు..

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదు. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇలాంటి సంస్కృతి మాది కాదు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రి అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నించడంతో వల్ల పెట్టారు. CMR షాప్ నుంచి కొని తెచ్చుకోవడంతో వచ్చింది కాదు ఖాకీ చొక్కా. అటువంటి ఖాకీ చొక్క ఊడదీస్తానని అనొచ్చా? వైసీపీ హయాంలో 2800 పై చిలుకు హత్యలు జరిగాయి. ఇలా ప్రవర్తిస్తేనే 151 నుంచి 11కి దిగిపోయావు నువ్వు. ఇకనైనా మారకపోతే అవి కూడా రావన్నారు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పెందుర్తి ట్రాఫిక్ అంశంపైనా పోలీసుల తప్పులేదు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో 1100 మంది పోలీసులను పెట్టాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేశాం. కానీ వాట్సాప్ లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు. కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూసారు. ఓ క్రిమినల్ నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో నిన్న తెలిసింది. హెలిపాడ్ దగ్గరకు తీసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇంతచేసి పోలీసులను తప్పు పడుతున్నారు. 

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

జగన్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే అదంతా చేశారుహెలికాప్టర్ దగ్గర జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. జగన్ వస్తున్నారనే సెక్యూరిటీ పటిష్టంగా ఉంచాం, జగన్ పర్యటనకు అడ్డు రాకూడదని ఎమ్మెల్యే పరిటాల సునీత స్వయంగా టీడీపీ కార్యకర్తలను ముందుగానే కోరారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.  వైసీపీ కార్యకర్తల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. మాజీ సీఎం కోసం 250 మంది పోలీసులు హెలిప్యాడ్ వద్ద ఉన్నారు. జగన్ హెలికాప్టర్ లో వెళ్లకుండా రోడ్డు మార్గంలో వెళ్లేందుకే హెలిప్యాడ్ దగ్గర గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం భద్రత దృష్ట్యా కేవలం ఒక సిగ్నల్ మాత్రమే నిలుపుతాం. జగన్ మానసిక స్థితిపై మాకు అనుమానంగా ఉందంటూ జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. 

 jagan | vanitha | police | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు