/rtv/media/media_files/2026/03/10/gas-cylinder-2026-03-10-19-28-53.jpg)
Gas Cylinder
దేశంలో గ్యాస్ కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. పలు నగరాల్లో చిన్న, పెద్ద హోటళ్లు మూతపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ఆపేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి. దీంతో దీంతో హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంబయి, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో పలు హోటళ్లను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కూడా హోటళ్లు మూసివేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే గ్యాస్ కొరత ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని హోటల్ యజమానులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బీఆర్‌ఎస్ పార్టీకి మాజీలు దూరం...గులాబీ శ్రేణుల్లో ఆందోళన
విశాఖ హోటల్ మర్చంట్ సంఘం ప్రెసిడెంట్ బాలకృష్ణ మాట్లాడుతూ విశాఖలో కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందన్నారు. సిలిండర్ల సరఫరా రేపటి నుంచి మరింత తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. విశాఖలో ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ నడుస్తోందని.. పరిస్థితి ఇలాగే ఉంటే నిర్వహణ కష్టంగా ఉంటుందని చెప్పారు. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల కొరతకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చామని హోటల్ యజమానులు తెలిపారు. గ్యాస్ కొరత లేకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు మూసివేసే యోచనలో ఉన్నామని చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో LPG దిగుమతలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడే డేట్ వచ్చేసింది!
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు గ్యాస్ సిలిండర్ల విషయంలో ఐటీ కారిడార్‌లోని హాస్టళ్ల యజమానులు ఆచితూచి వ్యవహరించాలంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు ‘సెల్ఫ్ కుకింగ్’ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. అంతేకాదు హాస్టళ్ల యజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అమలు చేయాలంటూ సూచనలు చేసింది. ఇదిలాఉండగా గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే ఇళ్లల్లో కట్టెల పొయ్యే దిక్కయ్యే పరిస్థితులు వస్తాయని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us