/rtv/media/media_files/2025/02/26/Z6MOq3zHtgAXgl7zEtuf.jpg)
kotappakonda Photograph: (kotappakonda)
పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు మహా శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజూ నుంచే అమరేశ్వరుని దర్శనానికి బారులుతీరారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు, అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్లు, బస్సులకోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించారు. ఆలయ ఆవరణలో క్యూలెన్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు అధికారులు.
Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
పోలీసులు కోటప్పకొండపై శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నిఘా పెట్టిన డ్రోన్ కూప్పకూలిపోయింది. బుధవారం ఉదయాన్నే సాంకేతిక సమస్యతో డ్రోన్ క్యాంటీన్ పైన ఉన్న విద్యుత్ తీగలపై పడింది. డ్రోన్ పడటంతో వైర్లుతెగి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రోన్ పడటంతో క్యాంటీన్ మూసివేశారు. ప్రమాద సమయంలో ఘటనాస్థలంలోనే పల్నాడు జిల్లా ఎస్పి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ లు ఉన్నారు. సిబ్బందిని క్యాంటిన్ పైకి ఎక్కించి డ్రోన్ సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు.
Also Read: కుంభమేళాలో శివరాత్రి ఆంక్షలు.. శివనామస్మరణాలతో దద్దరిళ్లిన ప్రయాగ్‌రాజ్