/rtv/media/media_files/sArPMYu3YLq6dbjwJuYj.jpg)
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. శుక్రవారం జరిగే కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య జరిగే శ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ఉచిత ప్రసాదంగా అందజేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట లో ఈ నెల 11వ తేదీన జరుగనున్న రాముల వారి కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామ స్వామి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నసందర్భంగా, ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహాం వద్ద ముఖ్యమంత్రి బస చేసే గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలు తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలన్నారు.
అటు తర్వాత టీటీడీ అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలోపుల ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో నిల్వ వున్న సామాగ్రి, వస్తువులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయం అంతా కలియ తిరిగారు. ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పలంకరణలలో రాజీ లేకుండా నాణ్యంగా పనులు చేపట్టాలని కోరారు.
అధికారులు సమన్వయంతో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు అందరికి అన్నప్రసాదాలు, స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, త్రాగునీరు, మజ్జిక పంపిణీ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవిన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
Also Read: Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!
kadapa | sita rama kalyanam at vontimitta | vontimitta kalyanam | vontimitta-kodandaram | vontimitta ramalayam | vontimitta sitarama kalyanam | vontimitta sita rama kalyanam | ttd | laddu
Goreti venkanna: ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర వంద రామాయణాలకు ధీటుగా ఉంటుంది: గోరటి వెంకన్న!
సమాజ శ్రేయస్సు కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారని కవి గోరటి వెంకన్న అన్నారు. ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర 100 రామాయణాలకు ధీటుగా ఉంటుందన్నారు. నిజం ఎక్కడుంటే కమ్యూనిజం అక్కడ ఉంటుందని నెల్లూరులో జరిగిన సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలో చెప్పారు.
Goreti venkanna
Goreti venkanna: సమాజ శ్రేయస్సు కోసం కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. దోపిడీ పాలకవర్గం తాత్కాలికమేనని, ప్రజల హక్కుల సాధనలో ఉద్యమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. సీపీఎం 27వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకొని నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్‌లో 3 రోజులుగా జరుగుతున్న సింహపురి సాంస్కృతికోత్సవాలు ముగిశాయి. చివరి రోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చిన గోరటి వెంకన్న.. సీపీఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నో పోరాటాలకు సాంస్కృతి కార్యక్రమాలు ఆయువుపట్టుగా నిలిచాయన్నారు. కళాకారులు ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
కమ్యూనిజం జీవించి ఉంటుంది..
జగతి ఉన్నంత వరకూ కమ్యూనిజం జీవించి ఉంటుంది. శ్రమ జీవుల వల్లనే దేశ సంపద పెరిగింది. కమ్యూనిస్టులు హింసావాదులు కాదు. హింసకు సమాధానంగా తమ నెత్తురుతో ప్రాణత్యాగాలకు పాల్పడిన మహాయోధులు. కమ్యూనిస్టులు నిరంకుశులు కాదు. అందుకు సమాధానం కార్మిక, వర్గ, ప్రజాస్వామ్యమే. పుచ్చలపల్లి సుందరయ్య, నంబూద్రిప్రపాద్, చండ్ర రాజేశ్వరరావు, సర్వదేవబట్ల రామనాధం,
ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి
ప్రమోద్‌దాస్ గుప్తా, జ్యోతిబసు, ఎకె గోపాలన్, భీమిరెడ్డి నరసింహారెడ్డి, నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం, జక్కా వెంకయ్య వీరంతా గొప్ప త్యాగధనులు. ఒక్కొక్కరి చరిత్ర రామాయణంలో రాముని కథవలే రామభక్తులు ఏ విధంగా పులకిస్తారో ఒక్కొక్క కమ్యూనిస్టు జీవిత చరిత్ర 100 రామాయణాలకు ధీటుగా ఉంటుంది. నిజం ఎక్కడుంటే కమ్యూనిజం అక్కడ ఉంటుంది' అని గోరటి వెంకన్న అన్నారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: లాహోర్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు.. అతిథుల లిస్ట్ ఇదే!
TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!
ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి
BIG BREKING: రాజమండ్రిలో RGVపై మరో పోలీస్ కేసు..!
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంటున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది..Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Mark’s Health Update : పవన్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే...?
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!
Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!
USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం