/rtv/media/media_files/2025/03/05/WxtkMvwQHq8GLtAwY5HW.jpg)
Girl father attacks daughter and son in law after love marriage
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కూతురు, అల్లుడిపై దాడి చేశాడు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
ఈ మధ్య ప్రేమ, పెళ్లి వ్యవహారంలో హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నవారిని కుటుంబ సభ్యులు హతమారుస్తున్నారు. పరువు పోయిందని మనస్థాపంతో కోపం పెంచుకుని ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
కుప్పంలో దారుణం
చిత్తూరు జిల్లా కుప్పంలో తాజాగా దారుణం జరిగింది. కూతురు కౌసల్య ప్రేమ వివాహం చేసుకుందని.. తండ్రి శివప్ప కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కుప్పంలో పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ పెట్టాడు. ఆ పంచాయితీలో పెద్దమనుషులకు తండ్రి శివప్పకు మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆ కోపంలో తండ్రి శివప్ప తన కూతురు కౌసల్య, అల్లుడు చంద్రశేఖర్ సహా రమేష్, సీతారామప్ప అనే మరో ఇద్దరిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రమేష్ అనే వ్యక్తి కడుపులో కత్తి ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మిగిలిన ముగ్గురు కూడా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కాగా గాయపడిన బాధితులు చంద్రశేఖర్, రమేష్, సీతారామప్పగా గుర్తించారు. వీరిది గుడుపల్లి మండలం, అగరం గ్రామం అని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.