/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Minister-Seediri-Appalaraju-jpg.webp)
Minister Seediri Appalaraju
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుతోపాటు 16 మంది పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. పలాస మండలం నీలావతికి చెందిన ఢిల్లీ రావు మృతి విషయమై న్యాయం చేయాలని మాజీ మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి శుక్రవారం పోలీస్ ఠాణా ముందుబైఠాయించిన విషయం తెలిసిందే. గుంపుగా ఏర్పడి పోలీస్ ఠాణాకు వచ్చే ప్రజలకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీసులు… వ్యవహరిస్తున్న తీరుపై నిత్యం వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది పోలీస్ అధికారులు…. వైసిపి నేతలపై అక్రమంగా పోలీస్ కేసులు పెడుతున్నారని జగన్ మోహన్ రెడ్డి కూడా మొన్న వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంతు చూస్తామన్నారు.అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ పోలీసుల తీర్పు కు నిరసన తెలుపుతూ మాజీ మంత్రి అప్పలరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి… పోలీసులకు చుక్కలు చూపించారు మాజీ మంత్రి అప్పలరాజు. జనవరి 2025 లో పలాసలో ఢిల్లీలో అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో.. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని… మాజీ మంత్రి అప్పలరాజు నిరసన తెలిపారు. కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీమంత్రి అప్పలరాజు ఈ మేరకు ఆందోళనకు దిగారు. దీంతో ఏం చేయాలో తోచక ఏపీ పోలీసులు తలలు పట్టుకున్నారు.
Also Read: Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !
minister | minister-seediri-appalaraju | minister-appalaraju | telugu-news | latest-telugu-news | latest telugu news updates