/rtv/media/media_files/2025/01/03/mxI71VN8zTUN9EGQzZM0.jpg)
jagan
మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఇంటి పక్కన ఉన్న గార్డెన్‌లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. రోడ్డకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోవడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!
వైయస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్నిప్రమాదం. సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయి.@ysjagan గారి భద్రతపై ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/tst2y6stCq
— YSR Congress Party (@YSRCParty) February 5, 2025
ఇది కూడా చూడండి: JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు..
కార్పోరేటర్లతో భేజీ అయినా..
ఇదిలా ఉండగా ఇటీవల బెజవాడ వైసీపీ కార్పోరేటర్లతో భేటీ అయిన వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0ను చూస్తారని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్ధ వైయస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.
ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
ఈ సందర్భంగా ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారని చెప్పారు. ఈ 2.0 వేరేగా ఉంటుందని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని, వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూస్తే బాధేస్తోందని, ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్ వాడితే.. చివరికి