/rtv/media/media_files/2026/04/11/accident-2026-04-11-18-19-49.jpg)
Keesara Toll Plaza
Keesara Toll Plaza : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తాపడడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. టోల్ కట్టేందుకు ప్లాజా వద్ద ఆగింది. ఈ సమయంలోనే హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ బ్రేకులు ఫేయిలవ్వడంతో వేగంగా దూసుకొచ్చి ప్లాజావద్ద నిలిపి ఉన్న కారుపై పడిపోయింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీనియర్ లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావు మృతిచెందారు. ఆయన ఎల్లారెడ్డిగూడలోని మారుతీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు.
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి గురైన కారును బీఎండబ్ల్యూ టీఎస్ 6662గా టోల్ సిబ్బంది గుర్తించారు. అందులో ముందు ముగ్గురు ఉన్నారని ప్రచారం సాగింది. అయితే అందులో శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నారని తేలింది. కారులో శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నారని, ఆయనే డ్రైవ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ప్రమాదానికి గురైన లారీ 16 చక్రాల అతి భారీ ట్యాంక్ కావడంతో కారు నుజ్జునుజ్జయింది. అతి కష్టం మీద క్రేన్లు, జేసీబీ సాయంతో కారు మీద పడిన ట్యాంకర్‌ను తొలగించారు. ఈ ప్రమాదంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. కాగా, వాహనాలు ప్రస్తుతం ఒకవైపు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి.
Follow Us