AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్‌

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా అటాచ్ చేసింది.

New Update
Andhra liquor scam case

Andhra liquor scam case

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా అటాచ్ చేసింది. లిక్కర్ స్కామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలున్నాయి. అయితే 2019 తర్వాత మద్యం విధానంలో మార్పులు చేసినట్లు ఈడీ గుర్తించింది. 

Also Read: డిజిటల్ జనాభా లెక్కలు.. సెన్సస్-2027 షెడ్యూల్ విడుదల

పాత లిక్కర్‌ బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, ఫేవర్ బ్రాండ్లకు స్పెషల్ ఆర్డర్లు ఇచ్చారని ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం దాకా కిక్‌బ్యాక్ తీసుకున్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు కూడా ఆపేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 

Also Read: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు