konaseema : కోనసీమలో కొత్త దేవుడు.. శనివారమే దర్శనం.. సాక్షాతూ వెంకన్నేనట!
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. కోరికలు తీర్చాలంటూ ఆయన వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. కోరికలు తీర్చాలంటూ ఆయన వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులో మాణిక్యం అనే వ్యక్తి తన భార్య ఉషారాణిపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. పిల్లలు చూస్తుండగానే బండరాయితో తలపై కొట్టి కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చారు.
కాకినాడ జిల్లా తాళ్ళరేవులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైడా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విఫా తుపాను కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ మండలంలో బూడిద వర్షం కురిసింది. ఇక్కడ సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇలా బూడిద పొడి వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక్కసారిగా బూడిద పొడి వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైలులో వసతుల కల్పనపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల వచ్చే ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.