ఆంధ్రప్రదేశ్ AP: పిఠాపురంలో జనసైనికుల ఆందోళన.. పవన్ కళ్యాణ్ కు అవమానం? పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌పై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టకపోవడంపై నిరసనకు దిగారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు పవన్ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్.. ఒక్క రాత్రికి రా అంటూ.. కాకినాడలో పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పెళ్లి కొడుకుపై కలెక్టర్, పోలీసులకు పెళ్లి కూతురు ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు కృష్ణమోహన్ ఫోన్ చేసి ఒక్క రాత్రి ఒంటరిగా రావాలని బెదిరించాడని తెలిపింది. మధ్యవర్తులే మొత్తం డబ్బు, బంగారం తీసుకున్నారని ఆరోపించింది. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..! వైసీపీ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ. దళితులకు పథకాలను లేకుండా చేసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఉంటే వారికి పథకాలను ఎందుకు దూరం చేశారు? దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దారుణం.. ట్యూషన్ మాస్టర్ అని నమ్మించిన యువకుడు.. బాలికలను ఎత్తుకెళ్లి.. కాకినాడ జిల్లా ధవళేశ్వరంలో మారోజు వెంకటేష్ అనే ట్యూషన్ టీచర్ ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేశాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత విద్యార్థుల తల్లి ఆరోపిస్తోంది. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణుల ధర్నా.! కాకినాడ జిల్లా పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నా చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాలన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మోదీని కలిసిన ఏలూరు ఎంపీ ప్రధాని నరేంద్ర మోదీని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించారు. అనంతరం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ సమస్యలు ప్రధానికి వివరించి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణకై డిప్యూటీ సీఎం తొలి అడుగు.. ఏం చేశారంటే? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మామిడాకులు, పూలతో వినాయక మండపంను అందంగా అలంకరించారు. పర్యావరణ పరిరక్షణకై తన నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ అవగాహన కల్పిస్తున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి.. కాకినాడలో పెళ్లి పేరిట మహిళలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కృష్ణమోహన్ అనే వ్యక్తికి వివాహిత నీరజను పెండ్లికుమార్తెగా చూపించారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని కృష్ణమోహన్ రూ. 6 లక్షలు, బంగారు గొలుసు అందజేశాడు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ World Tribal Day: ఏపీలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు! ఏపీలోని రాజమహేంద్రవరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఆదివాసులకు మద్దతుగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి కంబాల చెరువు వరకు ర్యాలీ చేపట్టారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn