/rtv/media/media_files/2025/02/13/HGP98L2qEt7L2RliMYvA.jpg)
bird flu chiken to fish Photograph: (bird flu chiken to fish)
ఆంధ్ర ప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ సోకి లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పలుప్రాంతాల్లో చేపల చెరువులకు మేతగా బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లును వేస్తున్నారు. కోళ్లు ఫాం యజమానులు చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేతగా పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను వేస్తున్నట్టు స్థానిక ఎన్జీవో సభ్యులు గుర్తించారు.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!
కాకినాడ ఎన్జీవో సభ్యులు వీడియోలు విడుదల చేసి జిల్లా కలక్టర్‌కు చూపించి ఫిర్యాదు చేశారు.
పర్యవేక్షణ చేయవలసిన ఫిషరీస్ అధికారుల సపోర్టు తోనే చెరువుల యజమానులు ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు. చేపల చెరువులపై పర్యవేక్షణ తగ్గిందని, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. చేపల చెరువులో బర్డ్ ఫ్లూ సోకి చనిపోయిన కోళ్లు దానాగా వేస్తే చేపలకు కూడా వైరస్ ఒకే అవకాశం ఉందని తద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటినే అవకాశం ఉందని ఎన్జీవో ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
Also read : మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!