/rtv/media/media_files/2025/02/27/a4wC4FtQOM2qsTNUAHvb.jpg)
Posani krishna Murali Arrest
అనుచిత వ్యాఖ్యలు చేయడం, టీడీపీ నేతలను, సినీ వర్గాల ప్రముఖులను తీవ్రంగా విమర్శించారు అన్న ఫిర్యాదులతో నటుడు పోసాని కృష్ణ మరళిని అరెస్ట్ చేశారు ఓబులవారి పల్లె పోలీసులు. అరెస్ట్ టైమ్ లో పోసాని ఇంటిలో చాలా డ్రామా జరిగిందని చెబుతున్నారు. మైహోమ్ భూజాలో ఉంటున్న అతని ఇంటికి పోలీసులు వెళ్ళారు. అయితే తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదం పెట్టుకున్నారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మీరెవరో నాకు తెలియదు..మీతో ఎందుకు రావాలి అంటూ ఆయన గొడవ పెట్టుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆయనను పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
అన్నం కూడా తిననివ్వలేదు..
మరోవైపు పోసాని కృష్ణ మురళి భార్య కథనం మరోలా ఉంది. చెప్పాపెట్టకుండా పోలీసులు తమ ఇంటి లోపలికి వచ్చేశారని ఆమె చెబుతున్నారు. పోలీసులు తమ ఇంటికి 8.50కు వచ్చారని..9.10 గంటల కల్లా ఆయనను తీసుకెళ్ళిపోయారని తెలిపారు. కనీసం అన్నం అయినా తిననివ్వలేదని అన్నారు. పోసాని కృష్ణ మురళి వయసు ప్రస్తుతం 66 ఏళ్ళు. ఆయనకు ఆరోగ్యం బాలేదని...రేపు ఎమ్ ఆర్ఐ చేయించాలని చెప్పామని...అది అయిన తర్వాత వచ్చి సరెండర్ అవుతారని చెప్పినా పోలీసులు వినలేదని పోసాని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అరెస్ట్ పై తమకు అనుమానాలున్నాయని, ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా చెప్పలేదని ఆమె వాపోయారు. పోసాని ఆరోగ్యం బాలేక సరిగ్గా కూర్చోలేకపోతున్నారని కూడా తెలిపారు.
అయితే పోలీసులు మాత్రం తామేమీ చేయలేదని...పోసానే తమతో గొడవ పెట్టుకోవాలని చూశారని అంటున్నారు. తాము నోటీసులు ఇస్తున్నా తీసుకోవడానికి నిరాకరించారని చెప్పారు. మా ఇంట్లోకి మీరు ఎలా వస్తారంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్పుకొచ్చారు.
Also Read: Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు!