/rtv/media/media_files/2025/03/03/tzOo4bynmHxuHUgDGwPn.jpg)
Adulterated milk Photograph: (Adulterated milk)
పోషకాలు పుష్కలంగా ఉండే పాలే ప్రజల ప్రాణాలు తీసేలా చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి హానికరమైన రసాయనాలతో కల్తీ తయారీనే వృత్తిగా ఎంచుకున్నారు కొందరు కేటుగాళ్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు గతంలో వెలుగు చూశాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లోనూ ఈ తరహా నకిలీ పాల తయారీ కేంద్రాలను గుర్తించారు అధికారులు. చిక్కదనం, తెల్లదనం కోసం మాల్టోడెక్స్‌ట్రిన్ అనే డేంజరస్ కెమికల్ వేసి కల్తీపాలు తయారు చేస్తున్నారు.
Also read:MLC elections Counting: 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం
మాల్టోడెక్స్‌ట్రిన్ మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతోంది. 25 కేజీల బస్తా రూ.1,900లకు లభిస్తోంది. దీన్ని పామోలిన్‌తో మిక్స్ చేసి చిక్కటి పేస్టుగా చేసి పాలల్లో కలుపుతున్నారు. మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపిన పాలల్లో వెన్న శాతం కూడా ఎక్కువగా చూపిస్తోంది. దీంతో ఎక్కువ రేటుకు పాలు అమ్ముడు పోతాయని కొందరు ఈ పని చేస్తున్నారు.
Also Read: Oscars 2025: అందరూ చూస్తుండగానే అతడిని ముద్దు పెట్టుకుంది.. ఇది రెండో సారి!!
మాల్టోడెక్స్‌ట్రిన్ ప్రమాదం ఏ స్థాయిలో అంటే..
మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపిన పాలు తాగితే జీర్ణవ్యవస్థలో భాగమైన హెల్తీ బ్యాక్టీరియా నాశనమైతుంది. దానికి బదులుగా చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. పాలను జీర్ణం చేసే లాక్టేజ్ ఎంజైమ్ ఉత్తత్పి తగ్గుతుంది. డైయాబెటిక్ ఉన్నవారు ఈ పాలు తాగితే షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి. తేన్సులు, కడుపులో మంట, అల్సర్‌కు దారితీస్తుంది. క్యాన్సర్‌కి కారకం కావచ్చు. పిల్లలతోపాటు పెద్దల్లో కూడా మాల్టోడెక్స్‌ట్రిన్‌తో కల్తీ అయిన పాలు తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.
కనిపెట్టండిలా..
ఈ కల్తీని కనిపెట్టాలంటే కొన్ని రకాల టెస్టులు చేయాలి. ఓ టెస్ట్‌ట్యూబ్‌లో 5మి.లీ పాలను తీసుకుని అందులో 2 మి.లీ అయోడిన్ వేసి కలపాలి. పాలు ముదురు ఎరుపు రంగులోకి మారితే అందులో మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపినట్లని అర్థం.
పాలు వేడి చేశాక వేలుకు రాసుకుంటే జారిపోతుంటాయి. అలా జారిపోకుండా చిక్కగా ఉందంటే మాల్టోడెక్స్‌ట్రిన్ కలిపారనే అనుమానం వ్యక్తం చేయవచ్చు.
లిట్మస్ పేపర్ కిట్ తో కూడా పాల కల్తీ తెలుసుకోవచ్చు. అనేక రకాల టెస్టింగ్ పరికరాలను అధికారులు తెప్పించి పాలల్లో కల్తీని గుర్తిస్తున్నారు.