/rtv/media/media_files/2025/04/08/6X8gDoKsTU0n7e9O8oRx.jpg)
phalaknama
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైలును అధికారులు పలాస వద్ద నిలిపివేశారు. విడిపోయిన బోగీలను సిబ్బంది రైలుకు అమరుస్తున్నారు. దీంతో గంట నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
— RTV (@RTVnewsnetwork) April 8, 2025
విడిపోయిన ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ బోగీలు
కప్లింగ్ వీడి రెండు భాగాలుగా విడిపోయిన రైలు
శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఘటన
భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం
జాయింట్ పనులను ముమ్మరం చేసిన రైల్వే… pic.twitter.com/YfzIk8rzRY
అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విడిపోయిన బోగీలను రైలుకు బిగిస్తున్నామని, వీలైనంత తొందర్లోనే తన గమ్యస్థానానికి బయల్దేరుతుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
srikakulam | falaknuma-express | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | howrah | Palasa