సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ కొడుకు దేవాంశ్ (9) చెస్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు సృష్టించారు. 'వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ -175 పజిల్స్' ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక సర్టిఫికేట్‌ను అందుకున్నాడు. తమ బిడ్డ ఇలాంటి ఘనత సాధించడంపై నారా కుటుంబ సభ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..! దేవాంశ్ సాధించిన విజయంపై నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. '' దేవాంశ్ ఈ ఆటను ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్ అరేనాలోని భారతీయ చెస్ క్రీడాకారులు, ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. ఈ వేడుక కోసం గత కొన్నివారాలుగా రోజుకు 5-6 గంటల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. చెస్ పాఠాలు నేర్పించిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవదాలు'' అని చెప్పారు. నారా బ్రాహ్మిణి కూడా కుమారుడు సాధించిన విజయాన్ని ఎక్స్ వేదికగా పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. Chandrababu Grandson Devansh World Record In Chess .@brahmaninara and I couldn't be prouder! Wishing you many more achievements, @naradevaansh! Keep shining! https://t.co/UkxQdy5z2c — Lokesh Nara (@naralokesh) December 22, 2024 Also Read: ఆస్పత్రిని ఢీకొని కుప్పకూలిన హెలికాప్టర్, నలుగురు మృతి ఇదిలాఉండగా.. దేవాంశ్ సృజమాత్మకంగా చెక్ నేర్చుకునే స్టూడెంట్ అని అతనికి కోచ్ అయిన రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన ఫజిల్స్‌ని పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతడి సొంతమని పేర్కొన్నారు. దేవాంశ్ చెస్ ప్రయాణంలో ఇదో మైలురాయిగా నిలిచుపోతుందని చెప్పారు. Also Read: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు Also Read: సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్