/rtv/media/media_files/2026/05/13/cm-chandra-babu-naidu-encourages-work-from-home-and-other-modi-advises-2026-05-13-16-04-39.jpg)
CM Chandra babu naidu encourages work from home and other modi advises
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రకటించిన 8 అంశాలను పాటించాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండాలన్నారు.
Also Read: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. వరికి మద్దతు ధర పెంపు
పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలాని.. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహించాలన్నారు. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయని చెప్పారు. దేశం మొత్తం దుబారా ఖర్చులను తగ్గించాలని సూచించారు. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ ఓ ఫ్యాషన్ గా మారిందని.. కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా నిలవాలన్నారు. సెక్యూరిటీని కూడా తగ్గించుకోవాలని చెప్పారు.
Also Read: CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!
ప్రధాని చెప్పినట్లుగా విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించారు. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో మంచి పర్యాటక ప్రాంతాలున్నాయని తెలిపారు. ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే మన పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్నారు. నాదేశం- నా బాధ్యత అనే ఆలోచన ప్రజలంతా చేయాలన్నారు. రెండ్రోజుల్లో దీనిపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. బంగారం కొనడం కూడా తగ్గించాలని.. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి చంద్రబాబు సూచించారు.
Follow Us