Murder : నెల్లూరు లో దారుణ హత్య ! అందరూ చూస్తుండగానే కత్తులతో..

నెల్లూరు పట్టణంలో రాత్రి అందరూ చూస్తుండగానే ఒక యువకున్ని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఓ రౌడీ షీటర్‌ ను ప్రత్యర్థులు హత్యచేయడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకున్నిఅతికిరాతకంగా కత్తులతో  నరికి చంపారు.

New Update
Rowdy sheeter chintu

Rowdy sheeter chintu

Murder : నెల్లూరు పట్టణంలో రాత్రి అందరూ చూస్తుండగానే ఒక యువకున్ని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఓ రౌడీ షీటర్‌ ను ప్రత్యర్థులు హత్యచేయడం కలకలం రేపింది. సీని ఫక్కీలో బైక్ పైవచ్చిన  గుర్తు తెలియని వ్యక్తులు యువకున్ని తరిమి..తరిమి అతికిరాతకంగా కత్తులతో  నరికి చంపారు. కాగా మృతుడు హౌసింగ్ బోర్డు కాలనీ కీ చెందిన రౌడీ షీటర్..సుజన్ కృష్ణ ఉరఫ్ చింటూ గా గుర్తించారు. చింటూ పై పలు కేసులతో పాటు వేదాయపాలెం పోలీసుస్టేషన్‌లో రౌడీషీటు ఉంది. గతంలో జరిగిన పలు హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 

ఇది కూడా చదవండి: Delimitation: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నగరంలోని పొదలకూరురోడ్డు ఇందిరాగాంధీ నగర్‌ రెండో వీధిలో  చింటూ 9.30 నిమిషాలకు నిలబడి ఉండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపారు. మృతుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ తరిమి తరిమి చంపారు.  సమాచారం అందుకున్న వేదాయపాలెం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించారు.

Also Read: Bsnl Cheapest Recharge Plan: ఓరి దేవుడా.. రూ.750లకే 6 నెలల వ్యాలిడిటీ- 180 GB డేటా కూడా!

ఘటన జరిగిన తీరును బట్టి పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు చింటూను ఫోను చేసి పిలిపించారని తెలిసింది. పోలీసులు స్థానిక సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఐదవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నిత్యం నేరాలు జరుగుతున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం షాపు లు 24 గంటలు తెరిచి ఉన్న పట్టించుకొనే వారు లేకుండ పోయారనే విమర్శ ఉంది.

ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Krishna River : పండుగ పూట విషాదం...కృష్ణానదిలో ఈతకు వెళ్లి..

పండగ సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు

New Update
Krishna River Tragedy

Krishna River Tragedy

Krishna River :   శ్రీరామ నవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. పండగ సందర్భంగా మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15).. ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ముగ్గురు బాలురు కూడా ఆలా ఈతకొడుతూ లోతును గమనించకుండా ముందుకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు! 

 బాలురు స్నానానికి వెళ్లిన సమయంలో అయితే వారితోపాటు పెద్దలెవ్వరూ లేకపోవడంతో వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లి మునిగిపోయారు. ముగ్గురికీ కూడా పూర్తిగా ఈత రాకపోవడం, లోతు మీదా అవగాహనలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయిదాటి పోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కాగా, అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ కుమారులు నదిలో పడిపోడవంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు గల్లంతు కావడంతో మోదుముడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

Advertisment
Advertisment
Advertisment