Balakrishna: చక్రం తిప్పిన బాలయ్య.. హిందూపురం మున్సిపల్ పీఠంపై టీడీపీ.. అక్కడ కూడా!

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చక్రం తిప్పారు. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు.

New Update
baklakrishna

balakrishna Photograph: (baklakrishna)

Balakrishna: హిందూపురం నియోజక వర్గంలో మరోసారి ఎమ్మెల్యే బాలకృష్ణ చక్రం తిప్పారు. ఆయన ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపాలిటీని(Hindupuram Municipal Elections) టీడీపీ(TDP) కైవసం చేసుకోగా మున్సిపల్‌ ఛైర్మన్‌(Municipal Chairman)గా 6వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌( Councillor Ramesh) ఎన్నికయ్యారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతు లభించగా రమేశ్‌ ఎంపికయ్యారు. వైసీసీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఇక ఈ ఓటింగ్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొనగా 3 సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.  

డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవం..

మరోవైపు ఏలూరు డిప్యూటీ మేయర్లు(Deputy Mayors) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదట డిప్యూటీ మేయర్‌గా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవగా రెండో డిప్యూటీ మేయర్‌గా దుర్గాభవాని(Durga Bhavani) కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. దీంతో ఏలూరును టీడీపీ కైవసం చేసున్నట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరులోనూ టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. తమసీన్ కు 41 ఓట్లు పడగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు మాత్రమే వేశారు. తహసీన్ ఎన్నికకు సహకరించిన కార్పొరేటర్లకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. 

Also Read:  TDP MLA Adimulam Issue: 50 మహిళలు, కాలేజీ అమ్మాయిలతో ఎమ్మెల్యే రాసలీలలు.. సీఎంకు సంచలన లేఖ!

బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే..

నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. మొదట వైస్‌ ఛైర్మన్‌గా 9వ వార్డు ఎరటపల్లి శివకుమార్‌రెడ్డి, రెండో వైస్‌ఛైర్మన్‌గా 8వ వార్డుకు చెందిన పటాన్‌ నస్రిన్‌ను ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇదిలా ఉంటే.. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.  సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, పిడుగురాళ్ల మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ ఎన్నిక కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను కోరం లేనందున అధికారులు వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశానికి వేసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నిక మంగళవారాని వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో స్పష్టం చేశారు. 

Also Read:  Bhumi Pednekar: అలా కూర్చొని.. భూమి ఇచ్చిన ఫోజ్‌కు కుర్రాళ్ల ఫ్యూజులౌట్!

Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment