/rtv/media/media_files/2025/03/29/6mlFW9KeYf0hEZyOY4cO.jpg)
Blade found eating bajji at east godavari district of ap
చాలా మందికి ఉదయాన్నే టిఫిన్ చేసే అలవాటు ఉంటుంది. కొందరు ఇంట్లో ఉండే వండుకుంటారు. మరికొందరు బయట టిఫిన్ సెంటర్లకు పోయి తింటారు. మరీ ముఖ్యంగా బ్యాచిలర్స్ లైఫ్ లీడ్ చేసేవారు.. ఎక్కువగా బయట టిఫిన్‌కు అలవాటు పడతారు. జాబ్‌కు ఆలస్యం అవుతుందనో.. లేక రూమ్‌లో వంటచేసుకోవడానికి కష్టంగా మారడంతోనో బయట టిఫిన్ చేస్తారు. అలా బయట నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినబోయిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
బజ్జీ తింటుండగా షాకింగ్
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో మరో హోటల్ నిర్లక్ష్యం బట్టబయలైంది. దేవరపల్లి మండలం యర్నగూడెంకు చెందిన ఓ యువకుడు టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లాడు. అనంతరం అక్కడ బజ్జీ పార్శిల్ చేయించుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. వేడి వేడి బజ్జీ తిందామని తహతహలాడాడు.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
వెంటనే పొట్లం ఓపెన్ చేసి బజ్జీ తింటుండగా.. ఒక్కసారిగా అవాక్కయ్యాడు. బజ్జీలో పదునైన బ్లేడ్ కనిపించడంతో ఆ యువకుడికి దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆ యువకుడు షాకై దెబ్బకు చెమటలు పట్టేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సంఘటన వైరల్ కావడంతో ప్రజలు సైతం ఖంగుతిన్నారు. కొంచెం ఉంటే ఆ బ్లేడ్ కడుపులోకి పోయి పేగులు తెగిపడేవని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువగా లాభాలు సంపాదించాలనే దురుద్దేశంతో కొందరు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. వారి నిర్లక్ష్యంతో ఎంతో మంది ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇప్పటి వరకు అన్నం, బిర్యానీ, కూరల్లో.. సిగరెట్‌లు, పరుగులు, ఎలుకలు వంటివి చూసుంటారు. ఇక ఇప్పుడు బజ్జీలో బ్లేడ్ రావడంతో బయట ఫుడ్ తినాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి
(viral-news | latest-telugu-news | telugu-news | east godavari news )