/rtv/media/media_files/2025/01/25/pUHNMbHkdWtqtHSomdCb.jpg)
CM Chandra babu Naidu
ఏపీకి, ఢిల్లీకి దగ్గర పోలికలున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. లిక్కర్ పేరుతో నెండు రాష్ట్రాల్లో సిస్టమ్ ను సర్వనాశనం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో జరిగిన స్కామ్ చాలా చిన్నదని అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతోంది. సుపరిపాలన మంచి రాజకీయాలకు నాంది అవుతుందని చంద్రబాబు అన్నారు. ఢిల్లీ, ఏపీల్లో ఇదే కరువైందని కామెంట్ చేశారు. అందుకే రెండు రాష్ట్రాల్లో ఆప్, వైసీపీ ఓడిపోయాయని చెప్పారు.
ఇది చారిత్రాత్మకం..
ఢిల్లీలో బీజేపీ విజయాన్ని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత దేశం గురించి చెప్పుకోవడం గర్వంగా ఉంది అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉంది. ఇప్పుడు బీజేపీ గెలుపుతో అవి తుడిచి పెట్టుకుపోతాయని అన్నారు. ఒక్కోసారి పరిస్థితి తారుమారు అవుతుంది. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ అని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ఢిల్లీ విజయం సాధ్యం అయ్యిందని.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ గొప్ప నాయకుడు.. రైట్ టైంలో రైట్ లీడర్‌షిప్ దేశానికి దొరికిందన్నారు. మోదీ వికసిత్ భారత్ 2047 అంటుంటే తాము వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటున్నామని అన్నారు.
Also Read: Delhi Elections: ఆప్ ను నిండా ముంచినవి ఆ మూడు కారణాలే..