![bird flu telangana](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/11/uAsV03MEdVunhfwnqpkK.jpg)
Bird flu Increased 40 lakh hens died in ap
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ (Bird Flu) విజృంభిస్తోంది. రెండు రాష్ట్రాల అధికారులు చికెన్ తినొద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ చికెన్ సెంటర్లలో దందా నడుస్తూనే ఉంది. ఏపీ ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం పదిధిలోని చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహించగా భారీగా మాంసం పట్టుబడింది. తమ సిబ్బందితో కలిసి కమీషనర్ స్వయంగా చికెన్ సెంటర్లవద్ద చంపి వేలాడకట్టిన కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : నన్ను వాడు చంపేస్తాడు..లక్ష్మీ సంచలన వీడియో విడుదల
కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం..
బర్డ్ ఫ్లూ ప్రభలుతున్నందున కొన్నాళ్ళపాటు కోడిమాంసం విక్రయాలు నిలుపుదల చేయాలని చికెన్ (Chicken) సెంటర్ల నిర్వాహకులకు కమీషనర్ ఆదేశాలు జారీచేసారు. ఒక షాపులో ఫ్రీజ్ లో నిలువచేసిన కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డులో దానిని కప్పిపెట్టారు. షాపు యజమానికి ఇరవై అయిదువేల రూపాయలు జరిమానా విధించారు. ప్రజలు కోడిమాంసం తినకుండా ఉండాలని బర్డ్ ఫ్లూ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ukraine: జెలెన్ స్కీ సంచలన ప్రకటన.. రష్యాతో ఆ మార్పిడికి సై అంటూ!
Also Read : భారత్ ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు
మరోవైపు ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్ననాయుడు రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని చెప్పారు. ఏలూరు జిల్లా బాదంపూడిలో 2 లక్షలు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం లో 7 వేల కోళ్లు చనిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. అయితే చనిపోయిన కోళ్లను లాబ్ పరీక్షల కోసం భోపాల్ కు పంపగా బర్డ్ ఫ్లూ తో చనిపోయినట్టు నిర్ధారణ అయిందన్నారు. పౌల్ట్రీలో ఉన్న గుడ్లను కూడా పూడ్చి వేశామన్నారు. ఇక 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు తనకు తెలిసిందని, కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. తక్కువ టెంపరేచర్ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని 10కిమి పరిధిలో. షాపులు మూసివేసామని చెప్పారు. బర్ద్ ఫ్లూతో ఆందోళన అవసరం లేదు. టెంపరేచర్ ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా వ్యాధి తగ్గుతుంది. 70 డిగ్రీల టెంపరేచర్ తర్వాత వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా నశించిపోతుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పౌల్ట్రీ లు శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Zuckerberg: పాకిస్థాన్‌లో జుకర్ బర్గ్‌కు మరణశిక్ష.. స్వయంగా వెల్లడించిన మెటా సీఈఓ!