/rtv/media/media_files/2025/02/27/jxkC3hlPV3y5CbSRkA7y.jpg)
TDP fans making old videos viral with Posani krishna murali arrest Photograph: (TDP fans making old videos viral with Posani krishna murali arrest)
తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోసాని క్వాష్ పిటిషన్ గురువారం హైకోర్టు విచారణ జరిగింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణ మార్చి 10 (సోమవారం)కి వాయిదా వేసింది.
Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్
ఆదోని కోర్టులో పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ వాదనలు జరుగుతున్నాయి. అలాగే ఆదోని 3 టౌన్ పోలీసుల పోసానిని మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టు కోరారు. ఇరు పక్షాల వాదనలు ఈ రోజు కొసాగుతున్నాయి. హైకోర్టులో విచారణ పూర్తి కాగా.. మరో రెండు కోర్టుల్లో పోసాని కేసుల విచారణ జరుగుతుంది. మరో కొన్ని గంటల్లొ ఆయా కోర్టుల్లో కూడా తీర్పు రానుంది.