Andhra Pradesh Assembly : నేడు AP బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీకి జగన్..?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా వేసి బీఏసీ మీటింగ్‌ నిర్వహించనున్నారు. 3వారాల పాటు సమావేశాలు ఉండనున్నట్లు ప్రాథమిక సమాచారం.

New Update
ap assembly

ap assembly Photograph: (ap assembly)

Andhra Pradesh Assembly : ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు వారాలపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోమవారం (ఈరోజు) ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా వేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. 

Also Read : American Airlines: ఢిల్లీకి రావాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్.. రోమ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తున్నారా అనే తెలియాల్సిఉంది.

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28న కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అదేరోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Alekhya Chitti Pickles New Business: పచ్చళ్ల బిజినెస్ క్లోజ్.. కొత్త వ్యాపారంలోకి అలేఖ్య చిట్టి.. ఈసారి ఏంటంటే?

అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయింది. ఇక నుంచి వారు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయాన్ని యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. త్వరలో రమ్య పేరుతో లడ్డూ బిజినెస్ ప్రారంభించబోతున్నారని అన్వేష్ తాజాగా చెప్పాడు.

New Update
Alekhya Chitti Pickles going to start a new business..

Alekhya Chitti Pickles going to start a new business

అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం మూడు రోజుల నుంచి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీ మరింత ముదిరిన నేపథ్యంలో అక్కా చెల్లెల్లు సుమ, అలేఖ్య, రమ్య వెనక్కి తగ్గారు. ఈ మేరకు అలేఖ్య చేసిన తప్పుకు ముగ్గురూ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదంలో ఘోరమైన ట్రోల్స్, విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంది. అలేఖ్య తీవ్ర అనారోగ్యం బారిన పడిందని.. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉందని ఆమె సిస్టర్ చెప్పుకొచ్చిన ఆడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇక ఈ వివాదం జరగడంతో వారు తమ పచ్చళ్ల బిజినెస్‌ను ఆపేశారు. అయితే ఆ బిజినెస్‌కు బ్రేక్ ఇచ్చి మరొక కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. ఈ మేరకు అలేఖ్య వివాదంపై అతడు స్పందించాడు. అలేఖ్య బూతులు మాట్లాడటం చాలా తప్పేనని అన్నాడు. వారి ముగ్గురిని తాను చెల్లెల్లుగా భావిస్తున్నానని.. దయచేసి వారిని క్షమించండి అని కోరాడు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కొత్త బిజినెస్‌లోకి అలేఖ్య చిట్టి

అంతేకాకుండా ప్రస్తుతం వారి పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా మూతపడిపోయిందని చెప్పుకొచ్చాడు. అందువల్ల త్వరలో వారు మరొక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు.ఇక నుంచి అలేఖ్య పికిల్స్ బిజినెస్ తీసేసి త్వరలో రమ్య పేరుతో లడ్డూ వ్యాపారం చేయబోతున్నారని అన్నాడు. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పూతరేకులు, లడ్డూలు, స్వీట్స్ వంటివి తయారు చేస్తారని తెలిపాడు. రేటు ఎక్కువగా ఉన్నా.. వీళ్లు క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పుకొచ్చాడు. అందువల్ల వీళ్లని వదిలేయండని.. అయిపోయిందేదో అయిపోయింది.. క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొన్నాడు. దీనిబట్టి చూస్తే ఇకపై అలేఖ్య పేరుతో కాకుండా రమ్య పేరుతో ఈ లడ్డూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news | naa anveshana)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు