Ap Weather: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఏకంగా 42 డిగ్రీలు..ఈ జిల్లాల వారికి మాడు పగులుతుందంతే!

ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 42.4, నెల్లూరు జిల్లాలో 42.2, కడప జిల్లాలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం తో పాటు 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.

New Update
Weather Alert: ఈ వేసవికి ఎండలు దంచికొడతాయి: ఐఎండీ హెచ్చరిక

Weather Alert

ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. అటు వేడిగాలులు జనాల్ని హడలెత్తిస్తున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా -14 మండలాలు, విజయనగరం జిల్లా-22 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా-12 మండలాలు, అల్లూరి సీతరామరాజు జిల్లా-9, అనకాపల్లి జిల్లా-9, కాకినాడ జిల్లా-7, తూర్పుగోదావరి జిల్లా-8, ఏలూరు జిల్లా-5, ఎన్టీఆర్ జిల్లా -3 మండలాల్లో తీవ్రవడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: UAE: యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయుల విడుదల!

 వేడిగాలులు వీచే మండలాల వివరాలకి వస్తే.. పల్నాడు జిల్లాలో 26 మండలాలు, ఏలూరు జిల్లా 22, గుంటూరు జిల్లా 17, కృష్ణా జిల్లాలో 17, ప్రకాశం జిల్లాలో 14, శ్రీకాకుళం జిల్లాలో 14, కాకినాడ జిల్లాలో 13, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 12, ఎన్టీఆర్‌ జిల్లా 12, తూర్పుగోదావరి జిల్లాలో 11, పశ్చిమగోదావరి జిల్లాల్లో 11, అనకాపల్లి జిల్లా 9, బాపట్ల జిల్లా 9, అల్లూరి సీతారామరాజు జిల్లా 6, విజయనగరం జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Also Read: Kerala:ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్!

గురువారం రాష్ట్రవ్యాప్తంగా  105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు  విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోనే ఎక్కువగా ప్రకాశం జిల్లా లో 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1, కర్నూలులో 41.7, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 41.4, తిరుపతి- రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండలాల్లో వేడిగాలుు వీచాయి. ఎండలు, వేడిగాలుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!

Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

ap-weather | AP Weather Alert | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు