/rtv/media/media_files/2025/03/29/M0QXDYBI9qPtKkndm3XN.jpg)
Pawan Vs Varma: పిఠాపురం టీడీపీ నేత(Pithapuram TDP leader), మాజీ ఎమ్మెల్యే వర్మ(Former MLA Varma) తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తూ వర్మ ఈ వీడియోను షేర్ చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. టీడీపీ, జనసేన(Janasena) అభిమానులు సైతం కామెంట్ల యుద్ధం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో జగ్గయ్య చెరువులో ప్రజలు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. pic.twitter.com/fNk3qzMFgy
— SVSN Varma (@SVSN_Varma) March 28, 2025
Also Read : బడికి వెళ్లమన్నందుకు..ఆరుగురు విద్యార్థులు అదృశ్యం!
గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్..
జనసేన నేతలు, వర్మకు మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసి గెలిపించుకుంటే ఇప్పుడు వర్మను పట్టించుకోవడం లేదని ఆయన అభిమానులు, స్థానిక టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.
Also Read : టాప్ మెహందీ ఆర్టిస్టు ఆత్మహత్య!
Also Read : ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
పవన్ గెలవడానికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, ప్రజలే కారణమని అన్నారు. అంతే కానీ పవన్ గెలవడానికి ఎవరైనా తానే కారణమని భావిస్తే అది వారి కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే.. వర్మ మాత్రం సైలెంట్ గా నియోజకవర్గంలో తన కేడర్ కోల్పోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తే అధినేత అనే కార్యక్రమం ద్వారా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
Also Read : నిజాంసాగర్ దగ్గర కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ
(pawan-kalyan | telugu-news | latest-telugu-news | telugu breaking news | today-news-in-telugu | andhra-pradesh-news)