AP Crime: ఏపీలో హైటెన్షన్.. పాస్టర్ ప్రవీణ్‌ను చంపిందెవరు?

రాజమండ్రిలో పాస్టర్‌ ప్రవీణ్‌ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. పాస్టర్‌కు ప్రాణహాని ఉందని నెల క్రితమే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక ఏదైనా ప్రమాద సంఘటనలో మృతి చెందారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

New Update

AP Crime:  రాజమండ్రిలో ఓ పాస్టర్‌ హత్య కలకలం రేపుతోంది. క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్‌ ప్రవీణ్‌ను కొందరు హైవేపై అనుమానాస్పదంగా హత్య చేశారు. అయితే తనకి ప్రాణహాని ఉందని నెల క్రితమే ప్రవీణ్‌ చెప్పారు. దీంతో ఆయనది హత్యే అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రవీణ్‌ మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ప్రవీణ్‌ను హత్య చేశారంటూ ఆస్పత్రి దగ్గర పాస్టర్‌లంతా ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ప్రవీణ్‌ను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఆరోపణ వస్తున్నాయి.

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు...

అయితే కొంతమూరు హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్‌ మృతదేహం కనిపించింది. అంతేకాకుండా ఒంటిపై గాయాలు ఉండటంతో ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని పాస్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు సంబంధించిన మొత్తం సీసీ ఫుటేజీని బయటపెట్టాలని పాస్టర్లు అంటున్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ మృతికి సినీనటుడు రాజా కూడా సంతాపం తెలిపారు.  

ఇది కూడా చదవండి: ఫేస్ మసాజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి?

దివాన్‌ చెరువు హైవేలో నాలుగో బ్రిడ్జి దగ్గర రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడని తెలుస్తోంది. బైక్‌పై వెళ్తుండగా ఘటన జరిగిందని చెబుతున్నారు. రాత్రి నుంచి సంబంధీకులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ప్రవీణ్‌ రెస్పాండ్‌ రాలేదు. ఆ తర్వాత మృతి చెందినట్టు పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు, పోలీసులు సైతం ప్రమాదం కాదు, ముఖంపై ఎన్నో గాయాలున్నాయని చెప్పారని పాస్టర్లు అంటున్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్‌ మృతి వెనుక ఉన్న కారణాలు తెలపాలని కోరుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఉదయం లేవగానే వేడి నీరు తాగే అలవాటు ప్రమాదకరమా?

 (ap-crime-news | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment