AP New RationCards: మంత్రి నాదెండ్ల శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన!

పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తిచేసి అందిస్తామన్నారు.

New Update
ap rationcard

ap rationcard

AP New RationCards: పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. 

ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే..

ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్డులో కుటుంబసభ్యులను చేర్చుకోవడంతోపాటు తొలగించేందుకు కూడా ఆప్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందని, నేటినుంచి దీపం-2 రెండోవిడత సిలిండర్‌ బుకింగ్‌ మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. గన్నీ బ్యాగ్స్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు. వాట్సప్‌ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించాం. ఇప్పటికే వాట్సప్‌ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛన్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు, కోటిన్నర కుటుంబాలకు 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం అందిస్తున్నామని, పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక నెల తీసుకోకపోయినా 3 నెల తీసుకునే అవకాశం కల్పించాం. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నామని, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి. 

ration-cards | nadendla-manohar | cm-chandrababu | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS sharmila: తల్లితో పాటు మేనల్లుడికి కూడా మోసం.. జగన్‌పై మరోసారి దుమ్మెత్తిపోసిన షర్మిల!

ఏపీ మాజీ సీఎం జగన్ తమ తల్లి విజయమ్మను మోసం చేస్తున్నాడని వైఎస్ షర్మిల అన్నారు. ఒక్క ఆస్తి తనకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు.

New Update

YS sharmila: ఏపీ మాజీ సీఎం జగన్ తమ తల్లి విజయమ్మను మోసం చేస్తున్నాడని వైఎస్ షర్మిల అన్నారు. ఒక్క ఆస్తి తనకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు.

ఆ షేర్లు గిఫ్ట్‌డీడ్‌..

ఈ మేరకు సరస్వతి పవర్‌ షేర్ల ఎంవోయూపై స్వయంగా సంతకం చేసిన జగన్.. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్‌ తనకు ఇవ్వలేదని అన్నారు. విజయమ్మకు సరస్వతి పవర్‌ షేర్లను జగన్‌ గిఫ్ట్‌డీడ్‌ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని కోర్టుకు వెళ్లారు. తల్లినే మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కొడుకు, మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ మండిపడ్డారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో లేదో ఆ పార్టీ నేతలే ఆలోచించాలన్నారు. 

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఇక ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై కూడా విమర్శలు గుప్పించారు షర్మిల. గతంలోనే వచ్చి మన మోహన మట్టి కొట్టి పోయారన్నారు.  మోదీ అమరావతికి రావడం ఇదేమి మొదటిసారి కాదు. మళ్లీ వచ్చిన ఒరిగేది ఏమీ లేదు. ఈసారి మళ్లీ వచ్చి సున్నం కొట్టి పోతారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. ఆంధ్ర ప్రజలు బతుకులు బాగుపడాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆమె అన్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం దేశానికి ఎంత ఉపయోగమో తెలీదు.. రాష్ట్రానికి మాత్రం చాలా ఉపయోగం. నేను పీసీసీ చీప్ గా ఉన్నది అస్తమానం జగన్ ను బీట్ చెయ్యడానికి కాదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటానికే అన్నారు. 

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

అలాగే విభజన హక్కులు సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని అన్నారు. ముఖ్యమైన ప్రత్యేక హోదా, పోలవరం సహా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. 11 ఏళ్ళు గడిచినా కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్కటికూడా అమలు చేయలేదు. ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిన మోడీని కేడీ అంటే తప్పేంటి? ఈ హామీలపై చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. ysr హయాంలో పోలవరంకు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. 10,150 కోట్లతో 190 టీఎంసీ కెపాసిటీతో 45.7 మీటర్ల ఎత్తుతో నిర్మాణం మొదలుపెట్టారు. 45.7 స్టోరేజ్ కెపాసిటీ తో కడితేనే ప్రాజెక్టు రాష్ట్రానికి వరం. ఎత్తు తగ్గిస్తే పోలవరం రాష్ట్రానికి వరం కాదు. ysr ఉనప్పుడు 33 శాతం పనులు పూర్తి చేసారు. తరువాత చంద్రబాబు 15 శాతం పనులు చేసారు. జగన్ సీఎం అయ్యేసరికి 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. ysr కు పోలవరం ఎంత ప్రాధాన్యత ఎంతో తెలిసి కూడా జగన్ పట్టించుకోలేదు. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు కేలవం 3 శాతం మాత్రమే చేసారు. ఇప్పుడు కేంద్రం ప్రాజెక్టు 41.15 మీటర్లు ఎత్తుకి తగ్గిస్తుంటే వీళ్ళు ఎవరూ మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు.

ఎత్తు తగ్గించడం ద్వారా కాస్ట్ తగ్గించాలని కేంద్రం చూస్తుంది. 85 వేల నిర్వాసితులను తగ్గించడానికి ఎత్తు తగ్గించేస్తున్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారారు. రాష్ట్రానికి కేంద్రం మోసం చేస్తుంటే వైసీపీ టీడీపీ జనసేన ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. 41.15 మీటర్ల ఎత్తుకి తగ్గిస్తే పోలవరం కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవుతుంది. 41.15 మీటర్లకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటే 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలరా..? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు చెప్పండి. పోలవరం పై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయండి. ప్రత్యేక హోదా గొంతు పిసికి చంపేసినట్టు పోలవరం ప్రాజెక్టును చంపే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

 ys-sharmila | ys-jagan | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment