Breaking: ఏపీ మంత్రి ఇంట తీవ్ర విషాదం

ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య షహనాజ్‌ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు. ఇంట్లో వెంటిలెటర్‌ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.

New Update
farook

farook

Breaking:ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య షమనాజ్‌ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ లోని ఇంట్లో వెంటిలెటర్‌ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం మృతి చెందారు.

Also Read: Ap-Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు వడగళ్లు,ఉరుములతో వానలు!

శనివారం ఉదయం హైదరాబాద్‌ లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల సీఎంతో పాటు మంత్రులు,ముఖ్య నేతలు సంతాపం తెలిపారు.

Also Read:MF Hussain Painting:వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. షెహనాజ్‌ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు.. అంత్యక్రియల్ని శనివారం నిర్వహించే అవకాశం ఉంది.

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. ఎన్‌ఎండీ ఫరూక్‌ సతీమణి మృతి పట్ల మంత్రి లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు. షెహనాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Also Read: America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

Also Read:  Phone Pay-Google Pay: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కొత్త రూల్స్!

 

minister | farook-abdhullah | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Son Accident :  నా ఆలోచనలన్నీ ఆ కుటుంబం గురించే.. వైఎస్ జగన్ సంచలన ట్విట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు.ఈ విషయమై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు.

New Update
Pawan Kalyans Son Mark Shankar

Pawan Kalyans Son Mark Shankar

Pawan Son Accident : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అక్కడి పాఠశాలలో చదువుతున్న శంకర్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.  అయితే విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. విశాఖ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

" సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఉప్పూనిప్పూలా పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని.. నెటిజనం కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..


మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మార్క్ శంకర్ ప్రమాదంపై స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు."సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

 


ఇక వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కూడా మార్క్ శంకర్ ఇవనోవిచ్ ప్రమాదంపై ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుషు మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ రోజా ట్వీట్ చేశారు.

 
మరోవైపు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్మకూడా ట్విట్‌ చేశారు.సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏.అని ఆయన ట్విట్‌ చేశారు.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment