/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Liquor-Price-Hikes-jpg.webp)
AP liquor scam
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు పెంచింది. సూత్రధారులు, పాత్రధారులకు ఉచ్చు బిగిస్తోంది. రాజ్ కసిరెడ్డితో పాటు విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన -ఆదాన్ డిస్లరీ, శార్వాని ఆల్కో బ్రువ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆదాన్, శార్వాని డిస్లరీలకు పెద్దమొత్తంలో మద్యం సరఫరా చేసినట్లు గుర్తించిన సిట్.. - అరబిందో శ్రీనివాస్‌తో పలువురు పెద్దలు కథ నడిపించినట్లు నిర్ధారించింది.
నెట్‌వర్క్ లో వైసీపీ కీలకనేత..
ఈ మేరకు మద్యం సరఫరా కంపెనీల నుంచి లంచాల వసూళ్ల నెట్‌వర్క్ లో వైసీపీ కీలకనేత కుమారుడు కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. రాజ్ కసిరెడ్డి కీలకమని భావిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఈ దందా నడిపించారని, ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలనేవి కసిరెడ్డి కనుసన్నల్లో జరిగినట్లు సిట్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని ప్రశ్నిస్తే ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం బయటపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నోటీసులివ్వడానికి మార్చి 25న హైదరాబాద్ జూబ్లీహిల్స్ రాజ్ కసిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో రెండోసారి ఆయన తల్లి సుభాషిణికి నోటీసులిచ్చారు. మార్చి 28న ఉదయం 10 గంటలకు విజయవాడ కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని చెప్పినా స్పందించలేదు. సిట్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో ఏప్రిల్ 9న విచారణకు హాజరుకావాలంటూ సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
https://www.youtube.com/live/LlWGSdho7u0
cm-chandrababu | sit | telugu-news | today telugu news