/rtv/media/media_files/2026/04/11/fotojet-33-2026-04-11-16-43-50.jpg)
Ration marts in ap
రేషన్ కార్డు ఉన్న ప్రజలు ఇక మీదట గంటల తరబడి రేషన్ షాపుల ఎదుట నిలబడి సరుకులు తీసుకోవలసిన అవసరం లేదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏపీ సర్కార్(ap governmenmt) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాష్ట్రంలో త్వరలో రేషన్ మార్ట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తొలుత కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా వీటిని ఏర్పాటు చేసి వాటి సద్వినియోగాన్ని బట్టి మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా ఏర్పాటు చేసిన మార్ట్‌లు సక్సెక్ అయితే రాష్ట్రవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం మరో సరికొత్త ఆలోచన కూడా చేసింది. రేషన్ మార్ట్‌ల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను సబ్సిడీలో సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రేషన్ మార్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మొదట విజయవాడ(vijayawada) లోని మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ మార్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం... స్పాట్‌లో ?
New Ration Marts In AP
ఇంతకు ఈ రేషన్ మార్ట్‌లో ఏ ముంటాయనే సందేహం రావచ్చు. ఇందులో బియ్యంతో పాటు పప్పు దినుసులు, రవ్వలు, కాస్మటిక్స్ తదితరాలు లభిస్తాయి. నిజానికైతే రేషన్ షాపుల్లో కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం, కందిపప్పు మాత్రమే లభిస్తాయి. అదే మార్టుల్లో అయితే నాణ్యమైన నూనెలు, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి ఇతర నిత్యావసరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రముఖ కంపెనీల వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మార్టుల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది.
అయితే దీని వెనుక రేషన్ షాపు డీటర్లకు మేలు చేయాలనే ప్రభుత్వం లక్ష్యం కూడా ఉంది. రేషన్ డీలర్ల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెబుతోంది. వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే కమిషన్‌తో రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఈ రేషన్ మార్ట్‌లకు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Also Read : ఏపీలో నిందితులపై వరుస కాల్పులు.. పోలీస్ మార్క్ ట్రీట్ మెంటా?
Follow Us