ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు.. పీసీసీ పదవినుంచి షర్మిల ఔట్!?

ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు.

author-image
By srinivas
New Update
Sharmila

APCC: ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. ఆమె వ్యవహార శైలిపై సీనియర్ నాయకులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం చేయాల్సిన షర్మిల.. కేవలం తన అన్న జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.  

వ్యక్తిగత వివాదాలకే పరిమితం..

ఈ మేరకు షర్మిల తన కుటుంబం, వ్యక్తిగత వివాదాల వరకే పరిమితమయ్యారని సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ మీట్లలో మాట్లాడిన తీరు స్పష్టంగా అర్థంమవుతోందంటున్నారు.  పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటినుంచి చంద్రబాబు సర్కార్‌పై చేసిన విమర్శల కంటే జగన్‌పై చేసిన ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయని మండిపడుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ డైరెక్టు షర్మిలను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఆమె కుటుంబ వివాదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అన్నయ్య మీదే ఆమె టార్గెట్. అతనిపై విమర్శలు చేస్తే చాలు. పార్టీ, రాష్ట్రం ఎలా పోయినా అనవసరం' అంటూ తనదైన స్టైల్ లో సెటైర్స్ వేశారు. 

ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పేరుతో భారీ సైబర్‌ స్కాం.. ఐడీ అప్‌డేట్‌ చేస్తామంటూ!

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విమర్శిస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం స్వయానా పీసీసీ చీఫ్ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం సరికాదని, ఇలా చేస్తే కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డను, తెలంగాణలో పుట్టిపెరిగాను, ఇక్కడే చదువుకున్నాను అంటూ బహిరంగ ప్రకటనలు చేసిన షర్మిలకు పార్టీ బాధ్యతను అప్పగిస్తే ఏపీ ప్రజలు ఎలా అంగీకరిస్తారన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ సంగతి పక్కనపెడితే.. కనీసం షర్మిలకు డిపాజిట్ దక్కలేని విమర్శించారు.  ఈ క్రమంలో షర్మిలను పీసీసీ పదవి నుంచి తొలగించేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

Also Read: ఏపీ విద్యార్థుల యూనిఫామ్‌ ,బ్యాగులు మారాయి!

Also  Read: AP: రైల్వే గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి ఈ స్టేషన్లలో కూడా ఆ రైళ్లు ఆగుతాయి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment