తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించాలని గత కొన్ని రోజులుగా తెలంగాణ నాయకుల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఈరోజు చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భేటీ కాగా.. ఈ భేటీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సీఎం చంద్రబాబుతో ఆయన చర్చించారు. ఈ మేరకు ఈ అంశంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
తిరుమలలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇందులో భాగంగా సీఎంతో భేటీలో విషయాలను వెల్లడించారు. వారానికి 4 సిఫార్సు లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
అలాగే వారానికి 2 బ్రేక్ దర్శనాలు, 2 రూ.300 దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ అంశంపై ఇటీవల కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం దక్కడం లేదని నేతలు గగ్గోలు పెట్టారు. ఇక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై శుభవార్త చెప్పడంతో నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి
శ్రీనివాస్‌గౌడ్ ఏమన్నారంటే?
నిన్న (ఆదివారం) విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడరు. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉండేవి కావన్నారు. ఎక్కడా ఏ తేడా లేకుండా జరిగేవని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులపై వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గతంలో కల్పించిన అన్ని సౌకర్యాను పునరుద్దరించాలన్నారు.
ఇది కూడా చూడండి: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం