/rtv/media/media_files/2025/03/11/jhKmrMnZkU5GiW4JaxEa.jpg)
AP CM Chandrababu good news to BC
బీసీలకు సీఎం చంద్రబాబు (Chandrababu) అదిరిపోయే శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ అందిస్తామని ప్రకటించారు. దీంతో 2కిలో వాట్ల రూఫ్‌టాప్ కు రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది.
బీసీల కోసం, వారి ఇంటి పైనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవటానికి రూ.80 వేల సబ్సిడీ ప్రకటిస్తున్నా.#APBudget2025 #PrajaBudget2025 #APAssembly #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/OO4cCQy0tt
— Telugu Desam Party (@JaiTDP) March 13, 2025
Also Read : ఈ రోజు నుంచి అల్పాహారంలో ఇవి ట్రై చేయండి.. బరువు ఇట్టే తగ్గిపోతారు
కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల రాయితీ..
ఈ మేరకు శాసనసభ వేదికగా పీఎం సూర్యఘర్ పథకం (PM Surya Ghar Scheme) కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని అనౌన్స్ చేశారు. 2 కిలో వాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చవుతుండగా కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.20 వేలు అదనంగా రాయితీ అందించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం 2 కిలో వాట్ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది. బీసీ వర్గాలకు అండగా ఉండాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
ఇదిలా ఉంటే.. పెట్టుబడుల ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని, ట్రాకర్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు రూ.1,21,659 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటికి ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపగా వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read : యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?
Also Read : ఏపీని వణికించిన దొంగల ముఠా అరెస్టు.. భారీగా తుపాకులు, కత్తులు, కారంపొడి స్వాధీనం!