/rtv/media/media_files/2025/03/17/OZ1gHiDckhpEMyJKRXi6.jpg)
ఏపీ క్యాబినెట్ (AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Also Read : విజయశాంతికి మంత్రి పదవి ఉండదు.. అలాంటివి KTRకే తెలుసు.. మంత్రి సురేఖ సంచలన కామెంట్స్!
వీవీఐటీయూకు ప్రైవేట్ వర్సిటీ హోదా
రాజధాని అమరావతి భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నంబూరులోని వీవీఐటీయూకు ప్రైవేట్ వర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Also Read : సెంట్రల్ గవర్నమెంట్‌పై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ దావా
ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే!
మరోవైపు 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ (Telangana) అని చెప్పారు. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే అని చెప్పారు. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు.
Also Read : జియో గుడ్ న్యూస్... రూ. 299 ప్లాన్ అదుర్స్.. IPL అభిమానులకు పండగే!
Also Read : పవన్‌పై శిల్పా రవి సెటైర్.. అల్లు అర్జున్‌ను ఇష్యూ బయటకు లాగిన జనసైనికులు!