/rtv/media/media_files/2025/02/28/p2QDmywD1nBBBSxHuDjl.jpg)
Payyavula Keshav AP Budget 2025
ఏపీ బడ్జెట్ ను రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ప్రవేశపెట్టారు. అయితే.. ఇందులో అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. సవిత నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖకు రూ.47,456 కోట్లను కేటాయించారు. సత్యకుమార్ నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.19,264 కోట్లు, నారా లోకేష్ పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు, మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వర్తిస్తున్న జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు కేటాయించారు.