/rtv/media/media_files/2025/03/15/MWFwx96Vm9rW8Z2g9RUc.jpg)
ap 10th class public exam time table 2025
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మార్చి 17 నుండి ప్రారంభమై.. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇదే విషయాన్ని విశాఖ జిల్లా విద్యాశాఖధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 09.30 గం. నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వాత్రిక విద్యా పీఠం ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 17 నుండి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
జిల్లా నుండి 29,927 మంది
విశాఖ జిల్లా నుండి మొత్తం 29,927 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వీరిలో 26,523 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 1404 మంది ప్రైవేట్ విద్యార్థులుగా పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇంకా 2124 మంది విద్యార్థులు వొకేషన్ ట్రేడ్ రాస్తారన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు హాజరవుతున్నారు అని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
ఇక పరీక్షలకు 265 వికలాంగు విద్యార్థులు హాజరవుతున్నారని.. వారి సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 134 సాధారణ కేంద్రాలు గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో 48 ఎ కేటగిరీ కేంద్రాలు, 71 బి కేటగిరీ కేంద్రాలు, 09 సి కేటగిరీ కేంద్రాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా జిల్లాలో ముందుగా గుర్తుంచిన సమస్యాత్మక 6 పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
అలాగే 134 పరీక్షా కేంద్రాలకు 134 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 134 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 1472 మంది ఇన్విజిలేటర్లను నియమించారని చెప్పారు. ఎ పి ఓ ఎస్ ఎస్ టెన్త్ పరీక్షా కేంద్రాలకు 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారని తెలిపారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించామన్నారు.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
రూల్స్
ఇక అన్ని పరీక్షా కేంద్రాలలో 144 సెక్షన్ విధించారని.. ప్రథమ చికిత్స సిబ్బంది, ఓ ఆర్ ఎస్ సాచెట్లు అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. హాల్ టికెట్ ఆధారంగా ఆర్ టి సీ ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోందని చెబుతూ.. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకు రాకూడదని సూచించారు. అందులో మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్ పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.