Fire Accident: ఏపీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలో విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. ఘటపై అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్‌పై ప్రెస్‌మీట్.. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్ శాఖ సీరియస్ వరస ప్రమాదాలు: వివరాల్లోకి వెళ్తే.. పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ కంపెనీ ఉంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విష వాయివులు లీకైంది. ఫార్మా కంపెనీలో పని చేస్తున్న కార్మికులు విష వాయువు పేల్చటంతో నలుగురు అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై వెంటనే స్పందిచిన కార్మికులు ఫైర్ సిబ్బందికి, యాజమాన్యంకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగలోకి దిగిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురికి రిమాండ్ విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో వరస ప్రమాదాలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. నవంబర్ 26న జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా లేబొరేటరీలో విష వాయవులు లీకైయింది. ఈ ప్రమాదంలో కూడా పని చేస్తున్న కార్మికులు ఒక్కసారికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాయువులు విడుదల కావడంతో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతి చెందాడు. మరో 9 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఏపీ సీఎం ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇది కూడా చదవండి: పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం! డిసెంబర్ 6న ఫార్మాసిటీలోని శ్రీ ఆర్గానిక్స్ ఫార్మా కంపెనీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రొడక్షన్ బ్లాక్‌లోని డ్రయర్ యంత్రం నుంచి ప్రొడక్ట్ బయటకు తీసేందుకు కార్మికులు మ్యాన్ హోల్ ఓపెన్ చేశారు. దీంతో ప్రమాదవశాత్తూ కెమికల్స్ ఇద్దరి కార్మికులపై పడ్డారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమయానికి వైద్యం అందిచటంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి వరస ఘటనలతో ఫార్మాసిటీ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..బెయిల్ రద్దుకు నేడు పిటిషన్!