/rtv/media/media_files/2025/03/19/D0SzPpebegxX0TvNZl8V.jpg)
MLC Marri Rajasekhar
MLC Marri Rajasekhar : వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. రాజశేఖర్ పార్టీని వీడి వెళతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ రాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలకు బలం చేకూరింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావు పై ఓటమిపాలయ్యారు.
Also Read: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
MLC Marri Rajasekhar Resigns
కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మర్రి రాజేశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మర్రికి టికెట్ ఇవ్వగా.. ఆ ఎన్నికల్లో అతడు ఓటమిపాలయ్యాడు. ఇక 2019లో ఆయనకు అవకాశం దక్కలేదు. అంతకు ముందే పార్టీలో చేరిన విడదల రజినీకి అవకాశం ఇచ్చారు జగన్. ఇక 2024 ముందు వైసీపీ ఎమ్మెల్సీగా పదవి పొందారు మర్రి రాజశేఖర్. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఆశించినప్పటికీ మర్రికి మరో సారి ఆశాభంగమే కలగడంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికలు ముగిశాక కూడా రజినీకే చిలకలూరిపేట ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మర్రి రాజశేఖర్ మరింత అసహనానికి లోనైనట్లు ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ పార్టీ మారతనే వార్తలు రాగా.. ఇప్పుడు అవి నిజమయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో ఉన్నట్లు సమాచారం.
Also Read: Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్!
Also Read : Uttar Pradesh: దొంగలుగా మారిన బీఎస్సీ విద్యార్థినులు.. ఆ ఇళ్లే టార్గెట్
కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జగన్.. ఆ షాక్ నుంచి తేరకోకముందే షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతూ వస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు కూడా జగన్‌కు, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అన్నీ తామై వ్యవహరించిన నేతలు కూడా పార్టీకి టాటా చెప్పేస్తున్నారు. కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలల్లోకి జంప్ అవ్వాలని చూస్తుండగా.. మరికొందరు మాత్రం వైసీపీకి రాజీనామా చేశాక ఏ పార్టీలోకి వెళ్లకుండా సైలెంట్‌గానే ఉండిపోతున్నారు. ఇక పార్టీలో ఉన్న మరికొందరు పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎగిరెగిరిపడిన నేతలంతా కూడా ఓటమి పాలైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన విషయం కూడా తెలిసిందే. ఇక ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నలుగురు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వీడారు.
Also Read: Ap Crime: జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి యువ సాఫ్ట్‌వేర్ మృతి..!