/rtv/media/media_files/2025/03/13/0rJQrTHfnGrLbAFQMquL.jpg)
andhra pradesh key reforms in ap intermediate education
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (AP Intermediate Board) లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశాన్ని అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాళాశాల విద్యార్థులను తీర్చి దిద్దడం కోసం 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్‌లో సంచలన మార్పులు చేశారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు
ఇందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యలోకి తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో జూన్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభం అయ్యేవి.. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచే స్టార్ట్ కానున్నాయి.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
అలాగే గతంలో జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యేవి.. కానీ ఇప్పుడు ఏప్రిల్ 7 నుంచే స్టార్ట్ కానున్నాయి.
2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చి 2026కి బదులుగా.. ఇకనుంచి ఫిబ్రవరి ఆఖరి వారం నుంచే నిర్వహించనున్నారు.
అంతేకాకుండా ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయనున్నారు.
ఈ 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
వీటితో పాటు లాంగ్వేజెస్, హ్యూమానిటీస్, సైన్స్ విభాగాల్లోని 24 ఆప్షన్స్ ఉండగా.. వాటిలో ఒక సబ్జెక్టును 2వ సబ్జెక్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ 2025-26 విద్యాసంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్సును ప్రవేశపెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 14 సబ్జెక్టులకు (లాంగ్వేజెస్, సైన్స్, హ్యుమానిటీస్, సహా) సవరించిన సిలబస్‌తో కొత్త పాఠ్యపుస్తకాలు అమలులోకి వస్తాయి.
అలాగే ఇంటర్‌లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఎ, బిలను ఇక నుంచి ఒకే సబ్జెక్టుగా విలీనం చేయనున్నారు.
దీంతోపాటు బైపీసీ విద్యార్థులకు బోటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టుగా విలీనం చేశారు.