కేంద్ర బడ్జెట్ 2025 (Union Budget 2025) ను ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్వాగతించారు. మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామం అని ఆయన అభిప్రాయపడ్దారు. మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. బడ్జెట్ లో పేదలు, మహిళలు, రైతులు సంక్షేమానికి ప్రాధన్యత ఇచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
Also Read : వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్
చరిత్రాత్మక నిర్ణయం
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు మాటలను గుర్తుచేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడం తెలుగువారందరికీ గర్వకారణమని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. బడ్జెట్ లో రూ. 12లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమని వెల్లడించారు. గతంలో ఈ తరహా నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదని చెప్పారు. దీనివలన చాలా మధ్యతరగతి కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాలని చెప్పుకొచ్చారు.
Also Read : ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు?
పోలవరానికి రూ.5,936 కోట్లు
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మరో రూ.54 కోట్లు కేటాయించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వను ఆమోదించింది.
Also Read : వందకు వంద శాతం ఇది దేశాభివృద్ధి బడ్జెట్ : ప్రధాని మోదీ
తెలంగాణకు అన్యాయం
అటు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణకు భారీగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై పోరాటం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలను ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Makhana Board : ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు?